తెలంగాణ వ్యాప్తంగా 1.24 లక్షల గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
జియో ట్యాగింగ్, పోర్టల్ సమాచారం ఆధారంగా విగ్రహాలను గుర్తించామన్నారు. ఇవన్నీ పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న విగ్రహాలు మాత్రమేనని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 8 వేల విగ్రహాలు పెరిగాయన్నారు. 10 రోజులుగా 88 వేల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు.