‘నిట్‌’ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ

69చూసినవారు
‘నిట్‌’ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ
TG: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కొత్త రికార్డు నమోదు చేసింది. ప్లేస్‌మెంట్‌ సీజన్‌ 2025-26 ప్రారంభ దశలోనే రికార్డు స్థాయిలో అద్భుత ఫలితాలను సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన బీటెక్‌ విద్యార్థి నారాయణ త్యాగి బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సీటీసీతో దేశీయ ఆఫర్‌ను పొందారు. ఇది వరంగల్‌ నిట్‌ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్