తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు: కేంద్ర మంత్రి

28చూసినవారు
తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు: కేంద్ర మంత్రి
దేశ వ్యాప్తంగా అక్రమంగా ఉన్న రేషన్​కార్డులను తొలగించినట్లు పార్లమెంటులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 5.51 లక్షల రేషన్​దుకాణాలో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీని సులభతరం చేసేందుకు ఆపాస్​పరికరాలను అమర్చడం జరిగిందని తెలిపారు. దీంతో రేషన్​సరకుల పంపిణీ అక్రమాలకు చోటు లేకుండా పోయిందన్నారు. అతి తక్కువగా ఏపీలో 102 కార్డులు, తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు తొలగించారన్నారు.

ట్యాగ్స్ :