తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 1.5 శాతం కట్

5094చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 1.5 శాతం కట్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిధికి ప్రతి ఉద్యోగి, పెన్షనర్ నుంచి మూల వేతనం లేదా మూల పింఛనులో 1.5 శాతం చందాగా కట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవోను విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల వేతనాలు, పెన్షన్ల (జూన్‌లో చెల్లించేవి) నుంచే ఈ 1.5 శాతం కోత అమల్లోకి రానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్