యూకేలోని రోమ్‌ఫోర్డ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 42 ఏళ్ల మాథ్యూ అల్లిక్ అనే వ్యక్తి పల్మనరీ ఎంబాలిజంతో గుండెపోటుకు గురై ఏకంగా 10 నిమిషాల పాటు చనిపోయాడు. ఆ సమయంలో అతని శరీరంలో 85% రక్తం గడ్డకట్టింది. అయితే, హామర్ స్మిత్ హాస్పిటల్ డాక్టర్లు సీపీఆర్, డీఫిబ్రిలేటర్ ఉపయోగించి అతడిని బతికించారు. అల్లిక్, ఇప్పుడు మానసిక ఆరోగ్య నిపుణుడిగా మారి, ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.