TG: ఓ చిన్నారి పుట్టిన 10 నెలలకే రూ.16 లక్షల విలువైన ప్లాటును తండ్రికి బహుమతిగా ఇచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో శంకర్ కుమార్తె హన్సిక(10నెలలు)ని అదృష్టం వరించింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.