TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గుండాల గ్రామాంలో మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి కుమార్ గౌడ్ నేతృత్వంలో దాదాపు 100 మంది
కాంగ్రెస్ నాయకులు, 18 కుటుంబాలతో సహా, తమ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా
బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని, ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.