TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ..
కాంగ్రెస్ 1000 రోజుల పాలన పీడనతో కూడుకున్నదని, రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలై వెయ్యి రోజులు అయ్యిందని ఆయన మండిపడ్డారు. అన్ని రంగాల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వారి పాలన క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. రైతులను రాచిరంపాన పెడుతున్న రాక్షస పాలన అంటూ
కేటీఆర్ ధ్వజమెత్తారు.