శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం సిద్ధం చేసిన 10వేల ప్యాకెట్లు కేవలం 3 రోజుల్లోనే ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే అదనపు స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒలింపిక్స్‌లో ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు, అయితే కరోనా సమయంలో వీటికి బ్రేక్ పడింది.