నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) గోరఖ్‌పూర్ వివిధ యూనిట్లలో 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 16, 2025 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. వివరాలకు ner. indianrailways.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.