ఎస్‌ఎస్‌సీలో 1,170 పోస్టులు

86చూసినవారు
ఎస్‌ఎస్‌సీలో 1,170 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాల నియామకానికి సంబంధించి మొత్తం 1,170 ఖాళీలతో సవరించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 4వ తేదీ నాటికి ఈ ఖాళీలున్నట్లు తెలిపింది. గతంలో ఏప్రిల్‌లో 731 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా దీనిని సవరించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పరీక్షలు జులై-ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నారు.