శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

9837చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
AP: తిరుమలలో శుక్రవారం శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక టోకెన్లు లేని సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 12 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా, గురువారం ఒక్కరోజే 67,534 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,411 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్