
దగ్గరికి వచ్చేస్తోన్న ‘మొంథా’
AP: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫాన్ దగ్గరికి వచ్చేస్తోంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ. వేగంతో తుఫాన్ ముందుకు కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 60 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, విశాఖపట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయంలో గంటలకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని APSDMA ఎంపీ ప్రఖర్ జైన్ అన్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




