తమిళనాడులో 12,000 ఏళ్ల నాటి శిలాజ నిక్షేపాల గుర్తింపు

53చూసినవారు
తమిళనాడులో 12,000 ఏళ్ల నాటి శిలాజ నిక్షేపాల గుర్తింపు
తమిళనాడులోని తూత్తుకుడిలో సుమారు 8,000 నుండి 12,000 ఏళ్ల క్రితం నాటి హోలోసిన్ కాలానికి చెందిన శిలాజ నిక్షేపాలను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) గుర్తించింది. 2023లో కురిసిన భారీ వర్షాల అనంతరం జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు ZSI చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేలో ఈ అరుదైన ఆవిష్కరణ జరిగింది. ఈ శిలాజాలు భారతదేశ క్వాటర్నరీ శిలాజ రికార్డును మెరుగుపరచడమే కాకుండా, ప్రాచీన వన్యప్రాణులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులపై విలువైన సమాచారాన్ని అందించనున్నాయి.

సంబంధిత పోస్ట్