రిపబ్లిక్ డే వేడుకల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్.. ఎందుకో తెలుసా?

38చూసినవారు
రిపబ్లిక్ డే వేడుకల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్.. ఎందుకో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్ కోసం త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వైమానిక దళం యుద్ధ విమానాలతో చేసే విన్యాసాలకు ఆటంకం కలగకుండా పక్షులను ఆకర్షించి దూరంగా ఉంచేందుకు 1275 కిలోల చికెన్‌ను ఆర్డర్ చేసినట్లు సమాచారం. జనవరి 15 నుంచి 26 వరకు ఎర్రకోట, జామా మసీద్ వంటి 20 ప్రాంతాల్లో గద్దల కోసం మాంసం విసిరే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్