భారత వాతావరణ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా మెటియోలాజికల్ డిపార్ట్‌మెంట్, మిషన్ మౌసమ్ పథకం కింద ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పలు ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 134 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలివ్వనున్నారు. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ లో నవంబర్ 24, 2025 నుంచి డిసెంబర్ 14 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.