దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27తో ముగియనుంది. ఆఫీస్ అసిస్టెంట్ 8,183, ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టులు 5,523 ఉన్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు తెలుగు భాష వచ్చిన వారు అర్హులు. ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో ఇవాళే దరఖాస్తు చేసుకోవాలి. పీఓ ప్రిలిమ్స్ నవంబర్ 21, 22న, క్లర్క్ ప్రిలిమ్స్ డిసెంబర్ 6, 12, 13న జరగనున్నాయి.