గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం అల్పాహారంలో పురుగులున్న ఉప్మా తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు.