మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో తాజాగా దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 15 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు గ్వాలియర్ ప్రాంతంలోని ఒక గుట్టపైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రూ.50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో గొంతు నొక్కి చంపేశారు. అనంతరం మరో వ్యక్తి సహాయంతో యువకులు బాలిక పెట్రోల్ పోసి తగులబెట్టారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.