సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'దూకుడు' చిత్రం విడుదలై సెప్టెంబర్ 22కి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. షూటింగ్ రోజులు నిన్ననే జరిగినట్లు ఉన్నాయని, మహేష్ బాబుతో పనిచేయడం మధురమైన అధ్యాయమని, దివంగత కృష్ణ మాటలు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాణానికి సహకరించిన వారికి, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.