
HPV వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరనే ప్రచారం.. కేంద్రం క్లారిటీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 14- 15 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ టీకా వల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుందని, పీరియడ్స్ డిస్టర్బ్ అవుతాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పీరియడ్స్ టైమ్‌లోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పింది. ఇది సింగిల్ డోస్ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది.




