పిడుగుపాటుకు బాలుడు మృతి

9738చూసినవారు
పిడుగుపాటుకు బాలుడు మృతి
TG: జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు 16 ఏళ్ల బాలుడు మల్లేష్ మృతి చెందాడు. కేటీ దొడ్డి మండలం యర్సన్‌దొడ్డి గ్రామానికి చెందిన మల్లేష్, పొలం నుంచి ఇంటికి వస్తుండగా వర్షం కురవడంతో కృష్ణస్వామి దేవాలయం సమీపంలోని చెట్టు కిందకు వెళ్ళాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్