జీపు లోయలో పడి 17 మంది మృతి

4చూసినవారు
జీపు లోయలో పడి 17 మంది మృతి
నేపాల్‌లోని రోల్పా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జీపు కొండ ప్రాంతంలో అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిపోవడంతో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. వర్షం కారణంగా ఏర్పడిన బురదతో వాహనం జారి లోయలో పడిందని పోలీసులు తెలిపారు. స్థానికులు జల్‌జలాలో వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్