పాకిస్థాన్‌లో వారం క్రితం క్వెట్టా సిటీలో ఓ ప్రయాణికుల రైలుపై కారు బాంబుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ఆ దేశ భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. బలోచిస్తాన్ ప్రావిన్సులోని వివిధ జిల్లాల్లో సెక్యూర్టీ దళాలు నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు 17 మంది అనుమానిత ఉగ్రవాదులు హతం అయ్యారు. కాగా, మే 24న క్వెట్టా సమీపంలో జరిగిన రైలుపై ఆత్మాహుతి దాడిలో 16 మంది ప్రయాణికులు, ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు.