AP: తిరుమలలో సోమవారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. ఆదివారం 83,578 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,137 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.5.07 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది.