TG: ప్రజా ప్రభుత్వం నిరంతరం పేదల కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తమని గెలిపిస్తూ ఉన్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా కొనసాగిస్తున్నామని పొంగులేటి చెప్పారు. దసరా నాటికి 2 లక్షల 18 వేల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి అవుతాయని మంత్రి వెల్లడించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొన్ని నియోజకవర్గాలకే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.