TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం సారపాకలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న 10 మంది ప్రయాణికులు, కండక్టర్, డ్రైవర్ గాయపడ్డారు. సమాచరం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.