ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబిబ్, ఆయన కుటుంబంపై ఉత్తరప్రదేశ్‌లో 20 కేసులు నమోదయ్యాయి. సుమారు ₹7 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హబిబ్, భార్య, కుమారుడు కలిసి గ్యాంగ్‌లా మోసాలు చేశారని పోలీసులు తెలిపారు. 35 మంది ఫిర్యాదు చేశారు. ఫాలికల్ గ్లోబల్ కంపెనీ పేరిట, క్రిప్టో స్కామ్‌లోనూ హబిబ్ కుటుంబం నిందితులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.