మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని టేకా నాకా పరిధిలోని ఒక మోటార్ సైకిల్ సర్వీస్ సెంటర్లో సుమారు 20 ద్విచక్ర వాహనాలు తగలేపడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఒక మాజీ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్వీస్ సెంటర్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. కపిల్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.