శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ
వీసా మోసం వెలుగుచూసింది. గురువారం, నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమైన వీరి వీసాలు నకిలీవని అధికారులు గుర్తించారు. వారిని చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.