TG: ఉపఎన్నిక వేళ బీఆర్‌ఎస్ బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సిరాజ్జుద్దీన్, 200 మంది అనుచరులతో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధిన్ సతీమణి హబీబా సుల్తానా సమక్షంలో వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.