TG: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 17 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లకూడదని
కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 47 వేల పోలీసు
ఉద్యోగాలు భర్తీ చేశామని,
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.