కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి జీడీపీ లెక్కింపులో 2022–23 ఆర్థిక సంవత్సరాన్నే బేస్ ఇయర్‌గా తీసుకోనుంది. ఇలా తయారయ్యే మొదటి అంచనాలు 2026 ఫిబ్రవరి 27న విడుదల కానున్నాయి. యాక్టివ్ కంపెనీల వివరాలు, ఎల్‌ఎల్‌పీ ఫైలింగ్స్, కార్పొరేట్ వార్షిక రిటర్న్స్, అసంఘటిత రంగ సర్వే డేటా వంటివి ఉపయోగించనున్నారు. ప్రైవేట్ కార్పొరేషన్లు, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో లేని సమాచారం ఈ కొత్త డేటా సెట్‌తో భర్తీ అవుతుందని భావిస్తున్నారు. నిపుణులు వచ్చే నెల 10లోపు తమ ఫీడ్‌బ్యాక్ పంపవచ్చని గణాంక శాఖ తెలిపింది.