
దారుణం.. కలలో చెప్పారని ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
గుజరాత్లోని నవ్సరీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలలో పిల్లలను చంపమని చెప్పారని.. ఐదు, ఏడేళ్ల వయసు ఉన్న తన పిల్లలను చంపేసింది. సునీతా శర్మ అనే తల్లి తన పిల్లలను కలలో పిల్లలను చంపి అనంతరం తన మామపై కూడా దాడి చేసింది. ఈ దారుణానికి పాల్పడే సమయంలో ఆమె.. సింహంపై వెళ్తున్న మాత ఫొటో పక్కన పెట్టుకుని, జుట్టు విరబోసుకుని, నుదుటన తిలకం పెట్టుకుని ఉందని తెలుస్తోంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని మానసిక స్థితిపై విచారణ చేస్తున్నారు.




