
చేతికి కట్టు తీసేసిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా చిత్రీకరణ సమయంలో మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ఆయన వైద్యులతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో చరణ్ చేతికి పెద్ద కట్టు లేకపోవడం, కేవలం సాధారణ బ్యాండేజ్, సపోర్టింగ్ బెల్ట్ మాత్రమే కనిపించడంతో ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.




