రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్

21చూసినవారు
రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. 2 రోజులే ఛాన్స్
దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్-D కేటగిరీలో 22,195 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2. సికింద్రాబాద్ పరిధిలో 1,012 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు టెన్త్ లేదా ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్