దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 23,757 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ (GDS), BPM, ABPM విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. APలో 917, TGలో 419 పోస్టులున్నాయి. పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల వయసు 18 - 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.