పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌కు ఎల్లుండే లాస్ట్

54చూసినవారు
పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌కు ఎల్లుండే లాస్ట్
దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS), BPM, ABPM ఉద్యోగాల భర్తీకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ 19తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 917, తెలంగాణలో 419 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21 వరకు గడువు ఉంది. రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వయసు ఉండి స్థానిక భాష తెలిసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.10,000 నుంచి రూ.29,380 వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్