శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

4చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
AP: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు లైన్‌లో వేచి ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే 74,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 36,562 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.3.66 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్