శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

2చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో టైంస్లాట్‌ భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, 45,283 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లుగా నమోదైంది.

సంబంధిత పోస్ట్