TG: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం రాత్రి పానీపూరి తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. పానీపూరి తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన బాధితులు వెంటనే ఆసుపత్రులకు పరుగులు తీశారు. ప్రస్తుతం వీరంతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పాత బస్టాండు కూడలి వద్ద ఉన్న ఓ పానీపూరి బండి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు పానీపూరి బండిని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.