
'ఎస్ఐ వేధింపులతోనే మా అమ్మ చనిపోయింది' (వీడియో)
TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమ నర్సమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నర్సమ్మ ఆత్మహత్యకు ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. ఓ బంగారం చోరీ కేసులో ఎస్సై స్టేషన్ కు పిలిపించి నేరం ఒప్పుకోవాలని వేధించారని, తన తల్లి మృతికి కారణమైన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కుమార్తె డిమాండ్ చేశారు.




