27 ఏళ్ల పోరాటం.. 59 ఏళ్లకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం

4252చూసినవారు
27 ఏళ్ల పోరాటం.. 59 ఏళ్లకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 59 ఏళ్ల విజయ్‌ కుమార్‌ శర్మ 27 ప్రయత్నాల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. 1999 నుంచి నియామక పరీక్షలు రాస్తున్న ఆయన.. గతంలో పలుమార్లు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనా ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. ఈసారి ఇంటర్వ్యూ లేకపోవడంతో TGT సంస్కృత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 26 ఏళ్లుగా ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ 22న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్