ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ నారాయణ్‌పుర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, పీఎల్‌జీఏ, ఏరియా కమిటీ సభ్యులు, మిలటరీ దళం కమాండర్, ఎల్‌ఓఎస్, జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్ డివిజన్‌లో 287 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ రాబిన్సన్ గుడియా తెలిపారు.