తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం (2బీహెచ్కే) ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీహెచ్‌సీఎస్) పరిధిలోకి బదిలీ చేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులకు ఇళ్లను సకాలంలో అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.