తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో ఉద్యోగులు లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించనున్నారు. ఇదే విధంగా, వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు కూడా శనివారం నుంచి సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.