కేరళంలో నూతన,గా ఏర్పడిన UDF ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి విద్యార్థినులకు ప్రతి నెలా 3రోజులు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 50 మందికి పైగా ఉద్యోగులున్న ఆఫీసుల్లో క్వాలిటీ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ రాజేంద్ర తొలి అసెంబ్లీ ప్రసంగంలో వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన 6 నెలల మెటర్నిటీ లీవ్స్ అమలు చేస్తామని తెలిపారు. నిరుపేదలు, అనాథలు లేని రాష్ట్రంగా మార్చేందుకు దత్తతలను ప్రోత్సహిస్తామన్నారు.