బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘త్రీ ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ అదిరిపోతుందని నటుడు ఆమీర్ ఖాన్ వెల్లడించారు. శర్మన్ జోషి, మాధవన్ కలిసి నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఆమీర్ ఖాన్ ఈ మూవీపై మాట్లాడుతూ, ఈ సినిమాకు సీక్వెల్‌పై పనులు ప్రారంభమయ్యాయని, స్టోరీ లైన్ చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోందని, అన్ని అంశాలు కుదిరితే ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు.