రైల్ వన్ మొబైల్ యాప్ ద్వారా జనరల్ రైలు టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు టికెట్ ధరలో 3 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. భారతీయ రైల్వే ప్రారంభించిన ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ల కొనుగోలును సులభతరం చేయడం, డిజిటల్ విధానంలో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రాయితీ ప్రకటించారు. ఈ సదుపాయం ఈ నెల 14 నుంచి జులై 14 వరకు అమలులో ఉంటుంది. ఈ యాప్‌తో జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి, ప్రయాణికులు తమ ఇంటి నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.