రోజూ 30 గుంజీలు తీయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాయామం పొత్తికడుపు కండరాలను బలపరచడమే కాకుండా.. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఉత్తమ వ్యాయామం. ఇది మెటబాలిజంను పెంచి, కేలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది.